Painting, Reading and Writing are my top most hobbies that are close to my heart. I continued to do all three this year. When I look back, I did five art works, read sixteen books, wrote eleven technology blog-post-articles, and nineteen personal blog-posts including twelve exclusive writings for "Neccheli" an internet Telugu magazine.
Sunday, December 31, 2023
The year in learning . . .
Painting, Reading and Writing are my top most hobbies that are close to my heart. I continued to do all three this year. When I look back, I did five art works, read sixteen books, wrote eleven technology blog-post-articles, and nineteen personal blog-posts including twelve exclusive writings for "Neccheli" an internet Telugu magazine.
Friday, December 15, 2023
Happy Birthday my dear Bhuvan 💙💙
Tuesday, December 5, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 15 ...
Sunday, November 5, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 14 ...
Saturday, October 7, 2023
Norman Rockwell - America's best known Illustrator . . .
Sunday, October 1, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 13 ...
Monday, September 4, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 12 ...
Saturday, August 5, 2023
Sunday, July 30, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 11 ...
Friday, July 14, 2023
Work with Masters...
Tuesday, July 11, 2023
My soul lives in my Art...
Tuesday, July 4, 2023
"శ్రీ రామ చంద్రుడు"...
Sunday, July 2, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 ...
Monday, June 19, 2023
Saturday, June 3, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 9 ...
Saturday, May 6, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 8 ...
ఇండియన్ ఇంక్ - అప్పట్లో ఈ ఇంక్ చాలా పాపులర్. ప్రత్యేకించి బ్లాక్ అండ్ వైట్ స్కెచింగ్ చెయటానికి ఎక్కువగా ఈ ఇంక్ నే వాడేవాళ్ళు. ఇంచుమించు అన్ని బుక్ షాపుల్లోనూ దొరికేది. ఆరోజుల్లో ఎవరో ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ వాడని ఇంక్ అయినా అంత సులభంగా అన్ని చోట్లా దొరికేది అంటే, దాని వాడకం చాలా పురాతనమై ఉండాలి. ఆర్ట్ కే కాకుండా ఇంకా చాలా విధాలా వాడుకలో ఉండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకూ ఆర్టిస్టులు స్కెచింగ్ కి ఎక్కువగా వాడేవాళ్ళు. చిక్కని అసలు సిసలు నల్లని డ్రాయింగ్ ఇంక్ కావాలంటే అప్పట్లో దీన్ని మించింది లేదు. చాలా మంది అర్టిస్ట్ లు బ్రష్ ముందు భాగం ఉండే కుంచెకి బదులు నిబ్ మాత్రమే ఉండి డమ్మీ పెన్ను లా ఉండే దాంతో ఈ ఇంక్ లో ముంచి లైన్ డ్రాయింగ్ వేసేవాళ్ళు. నేనూ ఇండియన్ ఇంక్ తో చాలా బొమ్మలు వేశాను. కానీ లైన్ డ్రాయింగ్ లు కాదు. అన్నీ కుంచె తో వేసిన నలుపు తెలుపు పెయింటింగ్సే.
Sunday, April 9, 2023
A piece of my Soul found a new home . . .
Sunday, March 26, 2023
"జీవిత రంగం" లోని "జీవి తరంగం" ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రరాజం - "రంగమార్తాండ"...
ఇద్దరు ధీటైన నటుల "రంగమార్తాండ"
"జీవిత రంగం" పై ప్రతి ఒక్కరూ నటులే. ఇది అందరూ అనేదే, ఒప్పుకునేదే. రకరకాల పాత్రల్లో ఎవరిశైలిలో వాళ్ళు జీవించేస్తారు, కానీ అందర్నీ మెప్పించలేరు. అదే, "రంగస్థలం" పై నటీనటులు నటనలో జీవించేస్తే ప్రతి ఒక్కరి మనసునీ దోచి అందర్నీ మెప్పించేస్తారు. అక్షరాలా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్నీ తమ "నటనా ప్రతిభ" తో దోచేసుకునే చిత్ర రాజమే - "రంగమార్తాండ".
చాలా రోజుల తర్వాత ధీటైన నటులనుంచి ఇంకా ధీటైన మంచి అద్భుత నటన తోబాటు, విలువలు కూడిన జీవితాన్ని వెండితెరపైనే కాదు మన కళ్ళముందే ఆవిష్కరించిన అనుభూతిని మిగిల్చే సినిమా ఇది.
అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు అనేకన్నా దర్శకుడు "కృష్ణ వంశీ గారు" వాళ్ళందరి నటనలోని జీవాన్ని వెలికితీసి విలువలు కలిగిన, ఎప్పటికీ కాలం చెల్లని కుటుంబ కథాజీవం తో కలిపి అద్భుతంగా ఆవిష్కరించారు అనొచ్చేమో. నటనలో పూర్తిగా పండిన నటీనటులు తలపండిన దర్శకుడి చేతిలో మంచి కధతో కలిసి నడిస్తే ఒక జీవితమే కళ్ళ ముందు ఆవిర్భవిస్తుంది. ఖచ్ఛితంగా ఈ సినిమాలో ఇదే జరిగింది.
"ప్రకాష్ రాజ్" గారు తన విశ్వరూపాన్ని చూపించగల సత్తా ఉన్న పాత్ర లభిస్తే చూపించకుండా ఉండగలరా, ఉంటారా...అచ్చంగా అదే చేశారు. "బ్రహ్మానందం గారు" స్వచ్ఛమైన నవ్వులనే కాదు, నవ్వులంత స్వచ్ఛంగానే ఆర్ద్రతనీ, విషాదాన్ని చేసి చూపించగరని అందరికీ తెలిసినా ఆ సత్తా చాటగల పాత్ర రావటానికి ఇంత కాలం పట్టింది, అంతే...ఇద్దరూ కలిసి హృదయాన్ని పిండేస్తారంతే!
"ఇళయరాజా గారు" ఇచ్చిన సంగీతం మళ్ళీ చాలా కాలానికి వీనులవిందు చేసి వదిలేస్తుంది. ఒకప్పటి, ఎప్పటికీ వినగలిగే స్థాయి సంగీతం మళ్ళీ చాలా కాలానికి.
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు "ఆస్కార్" ని తాకింది. కానీ ఆకాశాన్నైనా తాకగల ప్రతిభ మనకెప్పుడూ ఉంది. ఇలా అప్పుడప్పుడూ వచ్చే "రంగమార్తాండ" లాంటి సినిమాలే అందుకు నిదర్శనం!
ఇప్పటి కాలం, మన చుట్టూనే కాదు మన జీవితాల్లోనూ ఎన్నెన్నో మార్పుల్ని త్వరత్వరగా తెస్తూ అందర్నీ తనతో పరుగులు పెట్టిస్తున్నా...కుటుంబం, బంధాలూ, బాంధవ్యాలూ, మనసులూ, మమతలూ ఎక్కడికీ పోవు, అలానే చెదరకుండా ఎప్పటికీ ఉంటాయి అని ఈ చిత్రం చూస్తే తప్పకుండా నమ్మకం వస్తుంది అనిపిస్తుంది.
తల్లీ, తండ్రి హృదయాలు ఏకాలంలో అయినా ఒకటే. ఇది పిల్లలు ఆకాలంలోనూ, ఈకాలంలోనూ, ఏకాలంలోనూ గ్రహించలేరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయి తల్లీ తండ్రీ పాత్రలు పోషించే కాలం రాక తప్పదు, అప్పుడు ఆ పాత్రల్లో వాళ్ళూ జీవించకా తప్పదు. అలా తరతరాలు ఆ విలువల్ని కాపాడకా తప్పదు...ఇదే "జీవిత రంగం" లోని "జీవి తరంగం"!