Friday, September 25, 2020

"దివ్య స్మృతి" కి ప్రేమతో...

Sri S. P. Balasubrahmanyam, Legendary Indian Singer
Ballpoint Pen on Paper (8.5" x 11")    

నా అభిమాన "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో...

యావత్ భారతావనికీ తన పాటలలో స్వరమాధుర్యాన్ని జీవితాంతానికీ నిండా నింపి ఇచ్చి దివికేగిన "బాలు" గారు తెలుగు వాడిగా, మన వాడిగా పుట్టటం, "తెలుగు" తల్లికి ఎప్పుడో గంధర్వులిచ్చి తరించిన "దివ్య వరం".

తెలుగు పాటకే కాదు, తెలుగు మాటకూ, మాట నడవడికకూ వన్నె, గౌరవం తెచ్చిన స్వరం, వ్యక్తిత్వం "బాలు" గారిది.  సంగీతంతో గళం కలిపి లయబద్ధంగా చేసే స్వరవిన్యాసంలో, అక్షర ఉచ్ఛారణలో స్పష్టత తోబాటు, ప్రతి పదానికీ 'భావం', 'అనుభూతి' రెండూ జోడించి, పాడిన ప్రతి పాటకీ జీవం పోశారు మన "బాలు" గారు.

ఈ గాలీ, ఈ నేలా, ఈ ఊరూ, సెలయేరూ, "బాలు" గారిని కన్న ఈ తెలుగు నేలా, తెలుగు భాషా ఉన్నంత కాలం ఆ స్వరం వినబడుతూనే ఉంటుంది, అమృతాలొలికిస్తూనే ఉంటుంది.

కళాకారుడు వెళ్తూ ఇక్కడే వదలి వెళ్ళే ఆ కళ ఆనవాళ్లలో ఆ ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. అందుకేనేమో (కళాకారుడి) కళకి మరణం లేదు అంటారు.

నా బొమ్మలన్నింటిలోనూ "బాలు" గారి స్వరం మిళితమై ఉంటుంది. ఈ బొమ్మలోని ప్రతి గీతలోనూ ఒదిగిన నా "మనసు తడి" తో బాటు "బాలు" గారి "సుమధుర స్వరమూ" దాగి ఉంది.

అంతటి మహానుభావుడు "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో, భక్తితో ఈ చిత్రాన్ని సమర్పించుకుంటూ...

గత నలభై రోజులుగా "బాలు" గారు కోలుకుని నవ్వుతూ రావాలని 
ఆశిస్తూ తపించిపోయిన హృదయాలెన్నో...
మనల్ని వీడి దివికేగిన ఈరోజు బాధతో బరువెక్కిన గుండెలు ఇంకెన్నో...
కంట తడి పెట్టి చెమర్చిన కళ్ళు మరెన్నో...
తడిసి ముద్ద అయిన అభిమానుల మనసులు ఎన్నెన్నో...

"బాలు" గారిని అభిమానించే "ప్రతి మనసు" కీ
నా అభిమాన "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో
అంకిత భావంతో గీసిన
ఈ చిత్రం అంకితం!
🙏😢

~~~  ~~~ ~~~ 

"బాలు" గారితో, Chicago, USA, Sep 18, 2004

నా అభిమాన గాయకుడు "బాలు" గారిని ప్రత్యక్షంగా చూడటం జీవితంలో ఒక్కసారే Chicago లో వెళ్ళిన 3 గంటల Music Concert లో కలిగింది. కలవటానికి ఎవ్వరికీ అనుమతిలేని ఆ సాయంత్రం, నేను గీసిన "బాలు" గారి బొమ్మ, జయలక్ష్మి చూపిన చొరవతో నన్ను ఆయన దరి చేర్చింది. "బాలు" గారితో అలా ఓ పది నిమిషాలు గడపగలగటం నా జీవితంలో కలిగిన అదృష్టంగా, ఆ క్షణాలు మిగిల్చిన అనుభూతుల్ని "గొప్ప వరం" గా ఎప్పుడూ భావిస్తూనే ఉన్నాను, ఉంటాను...

నిన్న గాక మొన్నే "బాలు" గారి పుట్టినరోజని ఆనందం FB లో పంచుకున్నా...
మన అభిమాన "బాలు" గారినీ, ఆ మధుర క్షణాల్నీ మళ్ళీ తలచుకుంటూ....



Sunday, September 20, 2020

ఋణానుబంధం...

"ఋణానుబంధం"   
Watercolors on Paper (8.5" x 11")

ఏ జన్మలో మిగిలిన ఋణమో, కొందరికి ఈజన్మలో తీర్చేసుకుంటుంటాం.

నా బొమ్మలు అభిమానించే ఓ అభిమాని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి సంవత్సరీకానికి బహుమతి గా ఇవ్వాలనుంది, వేసివ్వగలరా అంటే, ఇలా ఒక ఐదారు గంటలు వెచ్చించి ఆ ఋణం ఇలా  తీర్చేసుకున్నా...అంతే!

అది వెలకట్టలేని సంతృప్తి!

Details
Reference: Unknown photograph
Mediums: Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper

Saturday, September 19, 2020

Win with a Smile...

Portrait of Chi. Karronya Katrynn
Ballpoint Pen on Paper (8.5" x 11")

Smile is beautiful, the beautiful God-given gift to humans. We often forget to use it. Win any given day with a smile. Win any given difficult situation with a smile. Win not only others, but also yourself with a smile.

Smile is the happiness of the heart and soul. Capturing a smile in Art is like capturing the happy heart. It must be captured as beautiful as the smiling soul. Smile is the only weapon that can bring peace instantly.

"Peace begins with a smile." ~ Mother Theresa

Keep smiling, keep drawing and painting with a smile, keep winning with a smile...

Details 
Title: The winning smile...
Reference: Portrait of Karronya Katrynn
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Saturday, September 12, 2020

పిల్లలూ దేవుడూ చల్లనివారే...


Ballpoint Pen on Paper (8.5" x 11")
Portrait of Baby Karronya Katrynn

పిల్లలూ దేవుడూ చల్లనివారే...
కల్లకపటమెరుగనీ కరుణామయులే..
~~~

విద్య + వినయం + విజ్ఞానం + వివేకం + వికాసం = విజయం

"The Innocence of a Kid is always mysterious to me!" ~ Giridhar Pottepalem

Happy Drawing!

Details 
Title: పిల్లలూ దేవుడూ చల్లనివారే...
Inspiration: Baby Karronya Katrynn
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

Monday, August 31, 2020

There goes away, a piece of my heart from (ho)me!

Day-1 with my "heart" in my hands, Urbana, IL, USA 


"Bhuvan?"
"Yeah"
"Can you come down for a sec? It's opinion time and I need your opinion."
"Ok"
"How is it?"
"It's good."
"Just good?"
"Very good!"

Last few years, I have been seeking Bhuvan's opinion on every single painting I worked on. Oftentimes he either says 'good' or 'very-good'. Sometimes, he even identifies areas of improvements. He has been my first critic, the very first person to see most of my completed Art works.

Bhuvan has never been away from me for more than a couple of weeks. It happened only once when he went to India on vacation with his mom and brother Rithvik. That was almost 10 years ago when he was little. I was asking him the other day if he ever was away from me for few days except his trip to India that I could not join. He reminded me his one-week school-trip to Washington D.C. in his 9th grade. Of course, that was another instance.

Bhuvan is a grown-up kid now, and goes all the way to Univ. of Michigan, Ann Arbor, MI, far away from (ho)me for his undergrad. I suddenly feel void in my life. I really don’t know how I lived before Bhuvan came into my life with a smile. When he smiled every single time I took him into my hands, on day-one in the hospital, I felt like my Dad came back into my life. His very first daycare caretaker “Susan” always used to say to me, “He is so cute, I don’t want him to grow up.”. I said the same to myself many times, year after year, every single year as he was growing up.

Time flies faster than we think, it flew-by very fast with Bhuvan in my life. It's only like yesterday that I was driving him to Kumon classes, RSM classes, FLL Robotics, Sunday classes at MIT, Soccer games, Basketball games, Ultimate Frisbee games, Tennis plays, daily Karate classes for 7 years until he got his black-belt, Swimming classes, Swimming meets, Piano classes, Violin classes, Sunday Prajna classes, Art classes, numerous birthday parties, Sleepovers, Hindu temples, cultural events and competitions he participated, events we attended, every family-trip we made in the past 17 years, and the list goes on. My evenings and weekends, last 17 years were mostly filled with him and his classes.

Now, suddenly new questions: "How am I going to live?" and "What am I going to do?" pop up in my mind, making me go blank. I was always hoping he would go to a college close to where we live, definitely not hundreds and hundreds of miles away. On one side I feel happy that Bhuvan chose one of the finest universities in the country and in the world. On the other half, I go unhappy as I miss him already. I knew this day arrives one day, but it arrived faster than I thought it would. It's been only two days since we dropped him off at his college. I am missing my heart already.

Whenever I say, "Bhuvan, you are my best friend.", he just nods his head. A follow-up saying, "Bhuvan, I am your best friend.", he simply smiles. That smile Bhuvan gives me is the same smile he gave me on day-one when he arrived in my life. The same smile that keeps me alive even when he stays away from (ho)me.

"Bhuvan, I left a piece of my heart in your college campus."
"I will collect it when you bring it back home with you once you finish your college."
"I am always your best friend."
"Give me that smile again..."
"Miss you!"
"Love you!"

- Your Best Friend
       ~ ~ ~ ~ ~
 
“Children make you want to start life over.” ~ Muhammad Ali

Bhuvan at his best, any sport he plays

His dream starts @ UMich, Michigan, USA

With my best friend in my life...@ UMich, Aug 29, 2020

Friday, August 21, 2020

వినాయకచవితి శుభాకాంక్షలు!

Handmade with Natural Clay
3D (9" x 6" x 5")
5lb (2.26 kg)

"వినాయక చవితి శుభాకాంక్షలు"!

పదేళ్ళక్రితం ఎంతో స్ఫూర్తి తో మొదలు పెట్టాను "మట్టి వినాయకుడు" ని చేత్తో చెయ్యటం. పది సంవత్సరాలు క్రమం తప్పక చేస్తూ వస్తున్నాను. ఇది వరుసగా 11 వ సంవత్సరం. ఏదో స్ఫూర్తి తో మొదలుపెట్టినా, ఇప్పుడిది సాంప్రదాయంగా మారింది. కాలం ఇంత త్వరగా కదిలిపోతుందా అనిపిస్తునంది. వెన్నక్కి తిరిగి చూసుకుంటే  ప్రతి పదేళ్ళకీ జీవితంలో వచ్చే మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

అన్ని మార్పుల్లోనూ మనతో ఉన్నది, ఉండేది, ఉండబోయేది మాత్రం ఖచ్చితంగా మనసే. 'మన'సే మన నేస్తం. మిగిలినవన్నీ మిధ్యే!

నువు ముందుకేసే అడుగు వెనకున్నది నీ అడుగే
వెనకేవస్తూ నిను ముందుకి నడిపించేది ఆ అడుగే
నీ మనసుని నువు నమ్ముకో
నిన్నెన్నడు వీడదని తెలుసుకో
                . . . . .

Making of Lord Ganesha 2020 . . .

 

Making of Lord Ganesha with Natural Clay

The tradition of "Making Lord Ganesha" with natural clay by hand that I adopted 10 years ago goes on this year too.

This is the 11 year straight year of making it for the festival "Vinayaka Chavithi"...

I wasn't sure if I could continue to do this year. I was bit tired in life and at some point I was thinking of giving up with this tradition. However, I firmly believe in the fact that 'once dropped is gone, and once gone is gone forever'. This applies to traditions as well as relations. We rarely get a second chance to prove ourselves. I will have to see how long I can continue this tradition. I know once I drop it, I will not get back to it forever. I am giving this "adopted tradition" a test, year after year!


Tools and Setup

Making...initial overall shape

Happy Sculpting...

Details 
Video Credits: Bhuvan Pottepalem
Mediums: Natural Clay 5lb (2.26 kg)
Size: 9" x 6" x 5" (3D)

Saturday, August 15, 2020

బామ్మ...

బామ్మ (1993, దామరమడుగు 

 

"అయ్యా...నాకేమైన ఉత్తరం వచ్చిందా?"

అటుగా వెళ్తున్న పోస్ట్ మ్యాన్ ని చూసి వాకిట్లో మెట్లపైన కూచుని, రోజూ ఆ సమయానికి అటు వస్తూ పోతూ ఉండే పిల్లా పెద్దని పరికిస్తూ, ప్రశ్నిస్తూ ఉండే  బామ్మ ప్రశ్న.

"లేదు బామ్మా" అంటూ చేతిలో ఉత్తరాల కట్ట సర్దుకుంటూ వెళ్లిపోయిన పోస్ట్ మ్యాన్.

మరుసటిరోజూ అదేవేళకి మళ్ళీ వాకిట్లో బామ్మ. ఇల్లు దాటి ముందుకి పోబోతున్న పోస్ట్ మ్యాన్ ని ఆపి  మళ్ళీ ప్రశ్న.

"అయ్యా...మా అబ్బాయి గిరి లండన్ లో ఉన్నాడు, నాకేమైనా జాబు రాశాడా?"

"అబ్బా....ఈమెకి లండన్ నుంచి రావాలయ్యా ఉత్తరం...ఏం లేవు పో బామ్మా." ఈసారి ఆ సమాధానంలో కొంచెం విసుగూ, వెటకారం.

ఆ మరుసటిరోజు...అదేవేళకి...ఈసారి బామ్మ వాకిట్లో కూచుని లేదు, ఇంట్లో లోపల ఏదో పనిలో ఉండగా మెట్లెక్కి, వరండా దాటి లోపలికొచ్చి, తలుపు దగ్గర నిలబడి, "బామ్మా..." అన్న పిలుపు.

ఆ పిలుపు పోస్ట్ మ్యాన్ దే.

పిలిచిన కాసేపటికి నిదానంగా "ఏయ్యా" అంటూ కళ్ళజోడు సరిజేసుకుంటూ వచ్చిన బామ్మతో పోస్ట్ మ్యాన్...

"ఇదుగో బామ్మా, నీకు ఉత్తరం వచ్చింది, ఆ...లండన్ నుంచే బామ్మా, నీ గిరి దగ్గరి నుంచే" అంటూ చేతిలో ఉత్తరం పెట్టిన పోస్ట్ మ్యాన్ తో...

"నేంజెప్పలా...మా గిరి లండన్ లో ఉండాడని...నీకంతా ఎకసెకం నేనంటే." అంటూ ఉత్తరం తీసుకున్న బామ్మ.

"లేదులే బామ్మా" అంటూ ఉత్తరాల కట్ట సర్దుకుంటూ మెట్లు దిగి వెళుతున్న పోస్ట్ మ్యాన్...

ఆ క్షణం అక్కడలేకున్నా ఆ "బామ్మ" పసిమనసెంత ఆనందంతో నిండిపోయి ఉబ్బితబ్బిబ్బయ్యి ఉంటుందో ఆ బామ్మ ప్రేమని పొందిన ఆమె ముద్దుల మనవడు "గిరి" ఊహించగలడు.

తొమ్మిదేళ్ళ వయసు లో 5 వ క్లాస్ నుంచీ హాస్టల్స్ లోనే ఉంటూ గిరి చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. చదువయ్యాక జాబు కోసం హైదరాబాదు ప్రయాణం. మూడు నెలల్లోనే మొదటి జాబు, మళ్ళీ కొత్త జాబు బొంబాయి లో, అట్నుంచి అటే జాబు పని మీద 3 నెలలు లండన్ పయనం. "అప్పుడప్పుడూ దామరమడుగులో బామ్మ కి ఉత్తరం రాస్తుండు" అని 5 వ క్లాస్ లో నాన్న రాసిన ఉత్తరాల్లో ని మాటలు చదువు ముగిసి జాబ్ లో చేరినా తూ...చ...తప్పకుండా పాటిస్తూ వచ్చిన గిరి.

ఆ "బామ్మ" ముద్దుల మనవడు "గిరి" ని నేనే. నన్ను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించి, తన జీవితం అంతా మాకోసమే మాతోనే ఉండి, నేను దగ్గరలేకుండానే కనుమూసి మా నాన్నను చేరుకుంది "నా బామ్మ"!

నేను పూర్తిగా తెలుగులో తన కళ్ళకి కట్టినట్టు లండన్ వైభవాలూ, విశేషాలూ వివరిస్తూ రాసిన ఆ ఉత్త్రరం ని, పాతదై, ముందూ వెనుకా చాలా పేజీలు పోయి, ఒక్కొక్క పేజీ చిరిగిపోతూ వస్తున్న తన మహాభారతం పుస్తకంలో మా దామరమడుగు ఇంట్లో రేడియో టెబుల్ డ్రాయర్ లో పెట్టుకుని అప్పుడప్పుడూ చదువుకుంటూనే ఉండేది "బామ్మ".

బామ్మకి తెలుగు చదవటం రాయటం బాగా వచ్చు, నిదానంగా అక్షరాలు తప్పుల్లేకుండా గుండ్రంగా రాసేది.. రామాయణం, మహాభారతం వంటి పెద్ద ఇంతింత లావు పుస్తకాలు ఉండేవి. ఇంగ్లీష్ లో P.R.C అన్న మూడు అక్షరాల్ని మాత్రమే చదవగలదు. మరే అక్షరమూ గుర్తుపట్టటం రాదు, నేర్చుకోలేక కాదు. ఈ లోకంలోనే తనకి అత్యంత ఇష్టమైన మా నాన్న "పి.రామచంద్రయ్య" తన షార్ట్ నేమ్ రాస్తే P.R.C అనే రాసేవాడు. ఆ మూడు ఇంగ్లిష్ అక్షరాల్నే బామ్మ ఇష్టపడింది.

నేటికి సరిగ్గా 26 సంవత్సరాల క్రితం నా మొదటి విదేశీయానం. ఆగస్ట్ 15, 1994, బోంబే టు లండన్.

"బామ్మ" ని గుర్తుచేసుకుంటూ...

నిండా కన్నీళ్ళు నిండిన కళ్లతో...

మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత...

"బామ్మ" కి ప్రేమతో...

- నీ "గోవర్ధన" గిరి

బామ్మతో నేనూ, అన్న (1993, కావలి)

London, 1994

London, 1994


Sunday, August 9, 2020

Colorful mess...

Watercolors on paper (8" x 14")   

Sometimes, even messing up with colors is fun in Painting, I would call such instance, a "colorful mess".

This is not meant to be a serious painting. After last week's very focused painting, I thought I would take a break this week. Still my hand was itchy for a brush, so felt like messing with colors on a left over cut-paper. I think I've messed up enough, and still can call it a painting ;)

As long as you know that you are messing up, you are still learning. Don't be afraid to mess up in Painting...

Keep Painting, Keep pushing yourself forward...

Happy Painting!

Details 
Reference: A random picture from my collection...
Mediums: Watercolors
Size: 8" x 14" (28 cm x 35.5 cm)
Surface: Arches Watercolor Paper, Cold Press, 140 LB

 


Tuesday, August 4, 2020

నవ్వుల పువ్వుల వెన్నెల...

Portrait of Chi. Karronya Katrynn 
Watercolors on Paper (12" x 16")

నవ్వుల పువ్వుల వెన్నెలా...
వెన్నెల నవ్వుల పువ్వులా...
పువ్వుల వెన్నెల నవ్వులా...

ఈ "చిన్నారి" కి "పుట్టినరోజు శుభాకాంక్షలు"!
Happy Birthday Chi. Karronya!

I believe this painting unquestionably moved me one step up in both Watercolor painting and Portrait painting. It was very challenging to capture the beautiful smile of Chi. Karronya as beautiful as it was.

I am extremely happy with my efforts. Of course, best efforts give best results. I always used to say 'my best is yet to come`. I can now proudly say, "one of my best has come".

Happy Painting! Happy Memories!!

"Be at your best, beat your best."
- Giri Pottepalem

Details 
Title: నవ్వుల పువ్వుల వెన్నెల...
Inspiration: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 12" x 16" (30.5 cm x 40.5 cm)
Surface: Fabriano extra-white Watercolor Paper, Cold Press, 140 LB

Saturday, August 1, 2020

... ... ...


"A masterpiece... may be unwelcome but it is never dull." - Gertrude Stein

Thursday, July 23, 2020

The book that moved my heart...

The Book that moved my heart...  


This book moved my heart. The author, William Somerset Maugham took me with him on a travel into the heart-touching life changes of an Artist, Charles Strickland, a man who abandons his secured stockbroker job & family to pursue an uncertain existence as an artist. By the end he creates and leaves a meaningful existence of his life.

Based on, and inspired by the life of the artist Paul Gauguin, this book takes the reader a century back in time through the life in London, Paris slums, and beautiful Tahiti. With a very heart touching ending, the book makes the reader to think about - meaningful existence for the life after.

Few thinkable and remarkable wordings I noted from the book:
  • A painters monument is his work.
  • A man's work reveals him.
  • Self-doubt is the artist's bitterest enemy.
  • "I have made something where there was nothing."
  • If you had your time over again, would you do what you did?
  • I raked my brain.
  • Love makes a man a little more than himself. and at the same time a little less. He ceases to be himself.
  • Great Art is always decorative.
  • Life is hard, and nature takes sometimes a terrible delight in torturing her children.
Many thanks to Vinnakota Narasimha Rao garu, for recommending this book to me while following my recent 10-day recollection-series on my initial college time art-work years. Otherwise, I wouldn't have known about this book at all, neither would have read the book, nor would have become curious about the well-known artist Paul Gauguin. Next time when I make a visit to Museum of Fine Arts Boston, I should feel Paul Gauguin's life through his original paintings in the collection over there.

Lives on the earth are interconnected, one action by someone somewhere leads to another action by someone else somewhere else.

Links: