ఒక్క పాటలో ఇన్ని హావభావాలా...పద పదం తో, ప్రతి సంగీత తరంగంలో కలసి... కేవలం కళ్ళతో, నవ్వుతో ఇంత అందంగానూ, ఇంత అద్భుతంగానూ పయనించొచ్చా? అసలు కళ్ళు పాడగలవా...నవ్వు నాట్యం చెయ్యగలదా...ఇది సాధ్యమా?
నవ్వు ఒక్క మనిషికి మాత్రమే అందిన వరం. చిరునవ్వుకే కొత్త అందాల్ని తెచ్చిచ్చిన ఈ అమ్మాయి ప్రతిభ కి ఎల్లలు లేవు. ఒకప్పుడు ప్రదర్శించే వీలులేక ఎన్నో వెలికి రాని, వెలుగు చూడని నైపుణ్యాలు. ఈ స్మార్ట్ యుగంలో, సొషల్ మీడియా అందించిన హద్దులులేని విశాల వేదికలు.
ఒక్కసారి ఈ పాటకి ఈ అమ్మాయి అభినయం, కళ్ళతో చిరునవ్వు కలసి చేసిన నృత్యం చూస్తే, ఎవరైనా మళ్ళీ మళ్ళీ చూడక మానరు, ఈ పాట మిమ్మల్ని చాలా కాలం వెంటాడకా మానదు.
అసలీ పాట వినని, విన్నా గుర్తులేని తెలుగు వాళ్ళెందరో! ఈ పాటలో ఓ ప్రత్యేకతా ఉంది. రెండు చరణాల ట్యూన్ భిన్నంగా ఉంటుంది, దేనికదే సాటిగా. అసలీ పాటని ఎంచుకోవటమే గొప్ప. ఎంచుకున్న పాటకే అందం తెస్తూ, జీవం పోస్తూ సొగసు వన్నెలద్దిన ఈ అమ్మాయి అభినయం అత్యుత్తమం, అత్యద్భుతం!!
Hats off to this naturally Beautiful Telugu Talent !!!
"A really great talent finds its happiness in execution."
- Johann Wolfgang von Goethe
( ఒరిజినల్ సాంగ్ "అల్లరి బుల్లోడు" అనే సినిమా కి బాలు, సుశీల పాడగా కృష్ణ, జయప్రద అభినయించారు. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం. )
ఒరిజినల్ సాంగ్ ని అనుకరించకుండా అభినయించింది. భలే అమ్మాయి !
ReplyDeleteఅవునండీ....ఒరిజినల్ సాంగ్ లో ఇన్ని అభినయాలుండవు. భలే అమ్మాయి !
Deleteమా స్నేహితుడు పంపిస్తే ఇవాళే ఈ వీడియో చూసాను. ఆద్భుతం. ఆయితే వీడియోలో ఏమీ వివరాలు లేవు ఎందుకో.
ReplyDeleteఎన్ని సార్లు ఈ వీడియో చూసినా తనివితీరట్లేదు!
ఇంతకీ ఒరిజినల్ సాంగ్ ఏ సినిమా లోది?
ఈ వీడియో వివరాలు నాకూ తెలీవండీ, ఓ మిత్రుడు పంపిస్తే చూశాను. సాంగ్ "అల్లరి బుల్లోడు" అనే మూవీ లోది. బాలు, సుశీల పాడగా కృష్ణ, జయప్రద అభినయించారు.
Delete