బాపు గ్రీటింగ్ కార్డుల్ని చూసి అచ్చం అలానే నేను వేసిన బొమ్మల్లోని(ది/ధి), సంతకం లేని అతి కొద్ది నా బొమ్మల్లో ఇదీ ఒకటి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో శలవుల్లో వేసింది. వేసిన ఇల్లూ, ఆ సమయం ఇంకా మదిలో పదిలం. నా బొమ్మల ప్రయాణం మొదలయిన టీనేజ్ లో "కావలి" లో మేం అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటింట్లో వేసింది. నా గ్రీటింగ్ కార్డుల సేకరణలో ఉన్న బాపు గారి గ్రీటింగ్ కార్డు ని చూసి, అచ్చం అలానే గీసిన గీతలవి. "బాపు" బొమ్మ ఒక్క "బాపు" కే సాధ్యం. ఈ ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు. అయినా అచ్చం అలాగే వెయ్యాలని పట్టిన పట్టు విడవని ఆ పట్టుదల ప్రతి గీత వంపులోనూ కనిపిస్తుంది. ఒక్కో గీతని ఎన్ని సార్లు చెరిపి గీసుంటానో నాకే తెలీదు. ఒక్క దెబ్బకి బాపు గారి ఏ గీతని అయినా అచ్చం అలాగే గీయగలిన ఆర్టిస్ట్ ఎవరూ లేరు, ఉండ(లే)రు కూడా. అంత దైవత్వం సంతరించుకున్న గీతలవి. బహుశా బాపు గారు డెభ్భై, యనభయ్యవ దశకాల్లో కేవలం గ్రీటింగ్ కార్డుల కోసమే కొన్ని బొమ్మలు వేసి ఉండొచ్చు. నాట్య భంగిమ లో నిలబడి ఉన్న ఈ విఘ్నేశ్వరుని బొమ్మ కూడా అలాంటిదే. గీతలనైతే ఎలాగో కష్టపడి అటూ ఇటుగా సాధించా, కానీ రంగులు అద్దటంలో తడబడిపోయా. కారణం అప్పటికి మన ఆర్ట్ ఇంకా గీతల దగ్గరే ఉంది, అది దాటి రంగులు అద్దే దాకా ఎదగలేదు. అప్పుడున్న కొన్ని స్కెచ్ పెన్నుల్తో రంగులు అద్దినా మెయిన్ బొమ్మ వెనక భాగం బ్లూ ఇంకు నీళ్ళల్లో కలిపి పూయటం, అందులోనూ పేపర్ సాదా సీదా పేపర్ కావటంతో ముద్దలు ముద్దలు గా అయిపోవటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పడ్డ కష్టమంతా ఈ బ్యాక్ గ్రౌండ్ రంగుల ముద్దల్లో కరిగి చెరిగిపోయి చెందిన మనస్తాపం ఛాయలూ ఇంకా మదిలో ఉన్నాయి. ఎప్పుడు ఈ బొమ్మ చూసుకున్నా ఆ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం కలవర పెడుతూనే ఉంటుంది. మామూలుగా అప్పట్లో ఒక బొమ్మ సంతృప్తిని ఇవ్వకుంటే మళ్ళీ అదే అంతకన్నా బాగా వేసి తృప్తిపొందే వాడిని. ఈ బొమ్మ గీతల్లో పడ్డ కష్టం మళ్ళీ పడటం సాధ్యం కాలేదు. రంగులు రాకున్నా, గీతలు బానే వచ్చాయి అన్న తృప్తి సరిపెట్టు కోవలసి వచ్చింది.
Saturday, July 5, 2025
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 31 . . .
బాపు గ్రీటింగ్ కార్డుల్ని చూసి అచ్చం అలానే నేను వేసిన బొమ్మల్లోని(ది/ధి), సంతకం లేని అతి కొద్ది నా బొమ్మల్లో ఇదీ ఒకటి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో శలవుల్లో వేసింది. వేసిన ఇల్లూ, ఆ సమయం ఇంకా మదిలో పదిలం. నా బొమ్మల ప్రయాణం మొదలయిన టీనేజ్ లో "కావలి" లో మేం అద్దెకుంటున్న మా "నారాయణవ్వ" పెంకుటింట్లో వేసింది. నా గ్రీటింగ్ కార్డుల సేకరణలో ఉన్న బాపు గారి గ్రీటింగ్ కార్డు ని చూసి, అచ్చం అలానే గీసిన గీతలవి. "బాపు" బొమ్మ ఒక్క "బాపు" కే సాధ్యం. ఈ ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు. అయినా అచ్చం అలాగే వెయ్యాలని పట్టిన పట్టు విడవని ఆ పట్టుదల ప్రతి గీత వంపులోనూ కనిపిస్తుంది. ఒక్కో గీతని ఎన్ని సార్లు చెరిపి గీసుంటానో నాకే తెలీదు. ఒక్క దెబ్బకి బాపు గారి ఏ గీతని అయినా అచ్చం అలాగే గీయగలిన ఆర్టిస్ట్ ఎవరూ లేరు, ఉండ(లే)రు కూడా. అంత దైవత్వం సంతరించుకున్న గీతలవి. బహుశా బాపు గారు డెభ్భై, యనభయ్యవ దశకాల్లో కేవలం గ్రీటింగ్ కార్డుల కోసమే కొన్ని బొమ్మలు వేసి ఉండొచ్చు. నాట్య భంగిమ లో నిలబడి ఉన్న ఈ విఘ్నేశ్వరుని బొమ్మ కూడా అలాంటిదే. గీతలనైతే ఎలాగో కష్టపడి అటూ ఇటుగా సాధించా, కానీ రంగులు అద్దటంలో తడబడిపోయా. కారణం అప్పటికి మన ఆర్ట్ ఇంకా గీతల దగ్గరే ఉంది, అది దాటి రంగులు అద్దే దాకా ఎదగలేదు. అప్పుడున్న కొన్ని స్కెచ్ పెన్నుల్తో రంగులు అద్దినా మెయిన్ బొమ్మ వెనక భాగం బ్లూ ఇంకు నీళ్ళల్లో కలిపి పూయటం, అందులోనూ పేపర్ సాదా సీదా పేపర్ కావటంతో ముద్దలు ముద్దలు గా అయిపోవటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు పడ్డ కష్టమంతా ఈ బ్యాక్ గ్రౌండ్ రంగుల ముద్దల్లో కరిగి చెరిగిపోయి చెందిన మనస్తాపం ఛాయలూ ఇంకా మదిలో ఉన్నాయి. ఎప్పుడు ఈ బొమ్మ చూసుకున్నా ఆ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం కలవర పెడుతూనే ఉంటుంది. మామూలుగా అప్పట్లో ఒక బొమ్మ సంతృప్తిని ఇవ్వకుంటే మళ్ళీ అదే అంతకన్నా బాగా వేసి తృప్తిపొందే వాడిని. ఈ బొమ్మ గీతల్లో పడ్డ కష్టం మళ్ళీ పడటం సాధ్యం కాలేదు. రంగులు రాకున్నా, గీతలు బానే వచ్చాయి అన్న తృప్తి సరిపెట్టు కోవలసి వచ్చింది.
Sunday, July 2, 2023
వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 10 ...
Sunday, August 21, 2022
పునాదిరాళ్ళు . . .
Saturday, September 25, 2021
బాలు గారి దివ్య స్మృతిలో...
Sunday, August 22, 2021
ఎంత ఎదిగిపోయావయ్యా...
Monday, May 31, 2021
డేరింగ్ & డాషింగ్ హీరో...
Saturday, January 30, 2021
Megastar...
Reference: Acharya Movie Still
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Sunday, November 15, 2020
విజేత...
Sunday, September 27, 2020
పాటలో దాచుకుంటానూ...
Saturday, September 26, 2020
"బాలు" గారి ఆశీస్సులు...
Friday, September 25, 2020
"దివ్య స్మృతి" కి ప్రేమతో...
నా అభిమాన "బాలు" గారి "దివ్య స్మృతి" కి ప్రేమతో...
Saturday, August 15, 2020
బామ్మ...
"అయ్యా...నాకేమైన ఉత్తరం వచ్చిందా?"
అటుగా వెళ్తున్న పోస్ట్ మ్యాన్ ని చూసి వాకిట్లో మెట్లపైన కూచుని, రోజూ ఆ సమయానికి అటు వస్తూ పోతూ ఉండే పిల్లా పెద్దని పరికిస్తూ, ప్రశ్నిస్తూ ఉండే బామ్మ ప్రశ్న.
"లేదు బామ్మా" అంటూ చేతిలో ఉత్తరాల కట్ట సర్దుకుంటూ వెళ్లిపోయిన పోస్ట్ మ్యాన్.
మరుసటిరోజూ అదేవేళకి మళ్ళీ వాకిట్లో బామ్మ. ఇల్లు దాటి ముందుకి పోబోతున్న పోస్ట్ మ్యాన్ ని ఆపి మళ్ళీ ప్రశ్న.
"అయ్యా...మా అబ్బాయి గిరి లండన్ లో ఉన్నాడు, నాకేమైనా జాబు రాశాడా?"
"అబ్బా....ఈమెకి లండన్ నుంచి రావాలయ్యా ఉత్తరం...ఏం లేవు పో బామ్మా." ఈసారి ఆ సమాధానంలో కొంచెం విసుగూ, వెటకారం.
ఆ మరుసటిరోజు...అదేవేళకి...ఈసారి బామ్మ వాకిట్లో కూచుని లేదు, ఇంట్లో లోపల ఏదో పనిలో ఉండగా మెట్లెక్కి, వరండా దాటి లోపలికొచ్చి, తలుపు దగ్గర నిలబడి, "బామ్మా..." అన్న పిలుపు.
ఆ పిలుపు పోస్ట్ మ్యాన్ దే.
పిలిచిన కాసేపటికి నిదానంగా "ఏయ్యా" అంటూ కళ్ళజోడు సరిజేసుకుంటూ వచ్చిన బామ్మతో పోస్ట్ మ్యాన్...
"ఇదుగో బామ్మా, నీకు ఉత్తరం వచ్చింది, ఆ...లండన్ నుంచే బామ్మా, నీ గిరి దగ్గరి నుంచే" అంటూ చేతిలో ఉత్తరం పెట్టిన పోస్ట్ మ్యాన్ తో...
"నేంజెప్పలా...మా గిరి లండన్ లో ఉండాడని...నీకంతా ఎకసెకం నేనంటే." అంటూ ఉత్తరం తీసుకున్న బామ్మ.
"లేదులే బామ్మా" అంటూ ఉత్తరాల కట్ట సర్దుకుంటూ మెట్లు దిగి వెళుతున్న పోస్ట్ మ్యాన్...
ఆ క్షణం అక్కడలేకున్నా ఆ "బామ్మ" పసిమనసెంత ఆనందంతో నిండిపోయి ఉబ్బితబ్బిబ్బయ్యి ఉంటుందో ఆ బామ్మ ప్రేమని పొందిన ఆమె ముద్దుల మనవడు "గిరి" ఊహించగలడు.
తొమ్మిదేళ్ళ వయసు లో 5 వ క్లాస్ నుంచీ హాస్టల్స్ లోనే ఉంటూ గిరి చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. చదువయ్యాక జాబు కోసం హైదరాబాదు ప్రయాణం. మూడు నెలల్లోనే మొదటి జాబు, మళ్ళీ కొత్త జాబు బొంబాయి లో, అట్నుంచి అటే జాబు పని మీద 3 నెలలు లండన్ పయనం. "అప్పుడప్పుడూ దామరమడుగులో బామ్మ కి ఉత్తరం రాస్తుండు" అని 5 వ క్లాస్ లో నాన్న రాసిన ఉత్తరాల్లో ని మాటలు చదువు ముగిసి జాబ్ లో చేరినా తూ...చ...తప్పకుండా పాటిస్తూ వచ్చిన గిరి.
ఆ "బామ్మ" ముద్దుల మనవడు "గిరి" ని నేనే. నన్ను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించి, తన జీవితం అంతా మాకోసమే మాతోనే ఉండి, నేను దగ్గరలేకుండానే కనుమూసి మా నాన్నను చేరుకుంది "నా బామ్మ"!
నేను పూర్తిగా తెలుగులో తన కళ్ళకి కట్టినట్టు లండన్ వైభవాలూ, విశేషాలూ వివరిస్తూ రాసిన ఆ ఉత్త్రరం ని, పాతదై, ముందూ వెనుకా చాలా పేజీలు పోయి, ఒక్కొక్క పేజీ చిరిగిపోతూ వస్తున్న తన మహాభారతం పుస్తకంలో మా దామరమడుగు ఇంట్లో రేడియో టెబుల్ డ్రాయర్ లో పెట్టుకుని అప్పుడప్పుడూ చదువుకుంటూనే ఉండేది "బామ్మ".
బామ్మకి తెలుగు చదవటం రాయటం బాగా వచ్చు, నిదానంగా అక్షరాలు తప్పుల్లేకుండా గుండ్రంగా రాసేది.. రామాయణం, మహాభారతం వంటి పెద్ద ఇంతింత లావు పుస్తకాలు ఉండేవి. ఇంగ్లీష్ లో P.R.C అన్న మూడు అక్షరాల్ని మాత్రమే చదవగలదు. మరే అక్షరమూ గుర్తుపట్టటం రాదు, నేర్చుకోలేక కాదు. ఈ లోకంలోనే తనకి అత్యంత ఇష్టమైన మా నాన్న "పి.రామచంద్రయ్య" తన షార్ట్ నేమ్ రాస్తే P.R.C అనే రాసేవాడు. ఆ మూడు ఇంగ్లిష్ అక్షరాల్నే బామ్మ ఇష్టపడింది.
నేటికి సరిగ్గా 26 సంవత్సరాల క్రితం నా మొదటి విదేశీయానం. ఆగస్ట్ 15, 1994, బోంబే టు లండన్.
"బామ్మ" ని గుర్తుచేసుకుంటూ...
నిండా కన్నీళ్ళు నిండిన కళ్లతో...
మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత...
"బామ్మ" కి ప్రేమతో...
- నీ "గోవర్ధన" గిరి
Monday, July 13, 2020
Day 9 of 10 - KAPIL DEV(IL)...
![]() |
Kapil Dev - 1987 Poster colors on Paper (8" x 10") ![]() |
Friday, July 10, 2020
Day 6 of 10 - Every art-work has a story to tell...
![]() |
Portrait of Prime Minister of India - Indira Gandhi Ballpoint Pen on Paper (8" x 10") ![]() |
Wednesday, July 8, 2020
Day 4 of 10 - Still, I wanted to paint and I never gave up...(cont'd)
![]() |
Kamal Hassan - 1987 Camel Poster Colors mixed with Acrylic on Paper (12" x 16"). ![]() |
Sunday, January 26, 2020
Kobe Bryant...
![]() |
My Tribute to Kobe Bryant ![]() |
Saturday, October 5, 2019
'మెగా'ద్భుతం...
![]() |
Portrait of Legendary Tollywood Hero Chiranjeevi from the movie- Sye Raa Narasimhaa Reddy Watercolors on Paper (9" x 12") ![]() |
'మెగా'ద్భుతం - "చిరంజీవి" 'సైరా నరసింహా రెడ్డి'
తెలుగు సినిమా చరిత్రపుటల్లో నిలిచిపోయే సినిమాలు తెలుగు తెరపై ఆగిపోయి చాలాకాలమే అయ్యింది. మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి, గుండమ్మ కథ, అల్లూరి సీతారామరాజు, దాన వీర శూర కర్ణ, శంకరాభరణం, సాగర సంగమం...ఇలా ఆనాటి చిత్రరత్నాల్నే ఈనాటికీ మనం చెప్పుకుని గర్విస్తుంటాం. మొన్నొచ్చిన "బాహుబలి" తెలుగు సినిమాని కొత్త ఎత్తులకి తీసుకెళ్ళినా అది వీటి సరసన నిలిచే చిత్రం కాగలదా అన్నది కాలమే చెప్పాలి.
సైరా నరసింహా రెడ్డి - ఒక అధ్బుతమైన సమరయోధుడి గాధని తెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్ర"రాజం". బ్రిటీషు వాళ్ళు ఆ వీరుడి తల నరికి 30 సంవత్సరాలకి పైగా ఇంకెవరు ఎదురు తిరగాలన్నా భయపడేట్టు కోట గుమ్మానికి వేళ్ళాడగట్టారన్న చరిత్ర ఘట్టాన్ని ఒక్కసారి ఆలోచిస్తేనే ఆంగ్లేయులని ఆయనెంత భయపెట్టి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన మొట్టమొదటి తెలుగు"వాడి" గా ఆయన పేరు ఈ సినిమా వల్ల పూర్తిగా వెలుగు చూసింది, దీనివల్లనే ఇంతమందికీ తెలిసొచ్చింది.
చరిత్ర లో మరుగైన ఆ వీరుడి గాధని కధగా ఎంచుకుని, దానికి మెరుగైన నటుడ్ని ఎన్నుకుని, కధనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలనుకోవటం, తండ్రి చిరకాల కోరికని తీరుస్తూ, ఆయనకే కాక ఆయన్ని ఆరాధించే, అభిమానించే కోటానుకోట్ల అభిమానులకి కానుకగా ఇవ్వాలనుకోవటం నిజమైన సాహసం. ఈ సాహసాన్ని చాలా మంది చాలా సార్లు చేసినా, ఇప్పటిదాకా మెప్పించగలిగింది ఒక్క "సూపర్ స్టార్ కృష్ణ" మాత్రమే, "అల్లూరి సీతారామరాజు" గా తెలుగు వెండితెరపై ఎప్పటికీ ఇంకెవ్వరూ "అల్లూరిసీతారామ రాజు" గాధని ప్రయత్నం చెయ్య(లే)రు అంటే "కృష్ణ" గారు తెలుగు ప్రేక్షకుల్ని అంతగా మెప్పించారు కాబట్టే. అంతటి సాహసాన్ని ఇప్పుడు చేసి, "బాహుబలి" ఎక్కించిన శిఖర ఎత్తుల్లో ఎక్కి కూర్చుని ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించటం అంటే నిజంగా "కత్తి" మీద కాదు...ఏకంగా "కత్తి మొన" మీద సాము చెయ్యటమే. ఆ సాము చెయ్యగల సమర్ధత ఈ తరం హీరోల్లో ఉన్న ఏకైక, ఆ, ఈ-తరం నటుడు "మెగా స్టార్" చిరంజీవి.
ఏ నటుడ్ని అయినా ఒక పాత్రలో "ఒదిగిపోయి అందులో జీవించాడు" అనాలంటే, ప్రేక్షకుడి కళ్ళ ముందు ఆ నటుడు కాదు, ఆ పాత్ర కనబడాలి, ఆ పాత్రలో జీవం ఉట్టిపడాలి. చరిత్రలో ఎప్పుడో జీవించి మరుగైన "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" పాత్రలో సరిగ్గా ఈ అద్భుతమే చేశాడు "చిరంజీవి". ఆయన ధైర్యసాహసాల్ని తెలుగు ప్రేక్షకుల కళ్ళెదుట తెరపై ఆవిష్కరించి, ఆ సమరయోధుడ్ని వాళ్ల మదిలో చిరస్థాయిగా కట్టిపడేశాడు.
వందల ఏళ్ళు పరాయి పాలనలో కన్న భూమిపైనే తిండికీ, గుడ్డకీ, గూడుకీ నోచుకోక, బానిసలై బ్రతుకుని ఈడుస్తూ, రోజూ చస్తూ బ్రతుకుతూ జీవించే ప్రజలు తమ స్వేచ్ఛకై పరాయి పాలకులపై తిరుగుబాటు చేసి సాగించే "స్వాతంత్ర్య సమరం" ని మించిన సమరం ఈ భూమిపైన ఏ మానవాళి కీ ఉండదు. అది సాధించిన ఘనత భారతదేశానిదీ, భారతీయులదీ. ఎందరిలోనో స్ఫూర్తిని నింపి సమర శంఖం పూరించి ముందుండి ఉద్యమ సమరాల్ని నడిపించిన వీరులు, వీరగాధలు మన చరిత్రలో ఎన్నో, ఎన్నెన్నో. అలాంటి ఒక వీరుడి పాత్రలో "చిరంజీవి" చూపిన అభినయం, చేసిన భీకర పోరాటాలూ, తెల్లవాడి ఎదుట రొమ్ము విరుచుకుని సింహం లా నిలబడి, వాడి పాలనని ధిక్కరిస్తూ, వాడి బలాన్ని సవాల్ చేస్తూ, మీసం తిప్పి "Get out of my Motherland" అంటూ గర్జించి, పోరాడి, చివరికి తన మరణమే జననం అంటూ ప్రాణాలొదిలి, చూసే ప్రతి ప్రేక్షకుడి మదినీ కదిలించి, కళ్ళల్లో కన్నీళ్ళని నింపిన పాత్రలో పూర్తిగా ఒదిగిన "చిరంజీవి" నటనా సామర్ధ్యం", "న భూతో, న భవిష్యతి"!
ఈ "చిత్రరాజం" ని ప్రతి తెలుగు వాడూ, ప్రతి భారతీయుడే కాదు, ప్రతి బ్రిటీషు వాడూ చూడాలి, చూసి తరించాలి!
ఈ సినిమాలో నటించిన నటులందరి నటనా, తెర వెనుకా తెరపైనా చూపించిన నైపుణ్యతా, దర్శకుని ఆలోచనా, తెరకెక్కించిన తీరుతెన్నులూ, పెట్టిన ఖర్చూ...అన్నీ ఎంతో ఉన్నత ప్రమాణాలతోనే ఉన్నాయి. ఈ సినిమా కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరూ అభినందనీయులే. ఎక్కడా రాజీ పడకుండా హృద్యంగా మలిచిన దర్శకుడు, నిర్మాత ప్రత్యేకించి "అభినందనీయులు".
సినిమా రంగంలో మొదటి మెట్టు నుంచీ "స్వయం కృషి" నే నమ్ముకుని, శ్రమిస్తూ, ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, మరెవరూ చేరుకోలేనన్ని ఉన్నత శిఖరాల్ని చేరుకున్నా, ఎదిగి ఒదిగిన వినయశీలీ, సౌమ్యుడూ, మృదుభాషి "చిరంజీవి" చిరంజీవ!
దాదాపు 35 ఏళ్ళ తరువాత నా చేతుల్లో ఒదిగి రూపుదిద్దుకున్న నా అభిమాన నటుడు "చిరంజీవి".
My Painting of Sri. Chiranjeevi and every single word in this blog post is my tribute to my favorite all-time Hero.
Details
Title: Portrait of Legendary Indian Actor Chiranjeevi
Inspiration: Sye Raa Narasimhaa Reddy, an epic Indian Movie
Mediums: Watercolors on Paper