Sunday, September 27, 2020

పాటలో దాచుకుంటానూ...

Sri S. P. Balasubrahmanyam, Legendary Indian Singer
Ballpoint Pen on Paper (8.5" x 11")   

ఊహ తెలిశాక బహుశా మొట్టమొదట నా హృదయాన్ని తాకిన పాట "బాలు" గారిదేనేమో. నాలుగేళ్ళ వయసు లో "బుచ్చిరెడ్డిపాళెం" లో ఉన్న రోజులనుంచీ విన్న పాటలన్నీ గుర్తున్నాయి. ఆటాలాడుకుంటుంటే ఇళ్ళల్లో రేడియోల్లోంచి వినబడే పాటల్లో ఏ "బాలు" గారి పాట మొదటిగా నా హృదయాన్ని తాకి ఉంటుంది అని ఎప్పుడాలోచించినా తట్టేవి ఈ రెండు పాటలే:

1. నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో (ఇద్దరమ్మాయిలు) ...
2. ఎక్కడో దూరాన కూర్చున్నావూ, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావూ (దేవుడమ్మ)...

ఇప్పటికీ ఈ పాటలంటే అమితమైన ఇష్టం. విన్న ప్రతిసారీ "బుచ్చిరెడ్డిపాళెం" లో ఊహ తెలిసిన నాటి  ఆనందమైన ఆ రోజుల్లోకెళ్ళిపోతాను.

మొదటిగా నా కలెక్షన్ అని నేను "కావలి" ట్రంక్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళే రోడ్డు మొదట్లో ఉన్న రెండు రికార్డ్ సెంటర్లకీ వెళ్ళి వాళ్ళ లిస్ట్ లో ఏరి కోరి 4 TDK (Made in Japan) క్యాసెట్టుల్లో రికార్డ్ చెయ్యించుకుని నాతో 1996 లో USA కీ తెచ్చుకున్న  అధికభాగం "బాలు" గారి పాటలే. అవన్నీ నా చిన్ననాటి పాటలే!

పై రెండు పాటలతోబాటు అప్పటి నా కలెక్షన్ లో ఇంకా:..

అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా అది ఎన్నెన్నో తెలియనీ (బుల్లెమ్మ బుల్లోడు)...
అందానికి అందానివై ఏ నాటికి నాదనవై (దత్త పుత్రుడు)...
అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా (మా నాన్న నిర్దోషి)...
అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవె (ముత్తయిదువ)...
అందాల నారాణి చిరునవ్వులే చిందితే గాలి ఈల వేసింది (రాముని మించిన రాముడు)...
ఇద్దరమే మన మిద్దరమే ఇద్దరమే కొల్లేటి కొలనులో సరికొత్త అలలపై (కొల్లేటి కాపురం)...
ఇది ఎన్నడు వీడని కౌగిలి మది ఎదలను కలిపిన రాతిరి (ప్రేమ జీవులు)....
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటానూ (పుట్టినిల్లు మెట్టినిల్లు)...
ఈ నాడు కట్టుకున్న బొమ్మరిల్లూ (పండంటి కాపురం)...
ఈ రేయి తీయనిదీ, ఈ చిరుగాలి మనసైనదీ (చిట్టి చెల్లెలు)... 
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే(మంచి మిత్రులు)...
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ (పూజ)...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా (పంతులమ్మ)...
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ (మల్లెపువ్వు)...
ఏ దివిలో విరిసిన పారిజాతమో(కన్నెవయసు)...
ఒక జంట కలిసిన తరుణాన జేగంట మోగెను గుడిలోనా (బాబు)...
ఓ బంగరు రంగుల చిలకా పలకవే (తోటరాముడు)...
ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటె (నేనంటే నేనే)...
కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం (చిల్లర దేవుళ్ళు)...
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా (నోము)...
కాపురం కొత్త కాపురం ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం (కొత్త కాపురం)...
కురిసింది వానా నా గుండెలోనా (బుల్లెమ్మ బుల్లోడు)...
కుశలమా నీకూ కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను (బలిపీఠం)...
కొమ్మకొమ్మకోసన్నాయీ కోటి రాగాలు ఉన్నాయీ (గోరింటాకు)...
కొండ పైనా వెండి వానా అది గుండెల్లో కొత్త వలపు కురిపించాలీ (ఇంటి దొంగలు)...
గులాబి పువ్వై నవ్వాలి వయసు ఇలాగె మనమూ ఉండాలిలే (అన్నదమ్ముల అనుబంధం)...
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో (చాణక్య చంద్రగుప్త)...
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు)...
తనివి తీరలేదే నా మనసు నిండలేదే (గూడు పుఠాణి)...
తనువా ఊహు హరిచందనమే (కధానాయకుడు)...
తొలిసారి ముద్దివ్వమందీ చెలి బుగ్గ చేమంతి మొగ్గ (ఎదురీత)...
దేవుడు చేసిన పెళ్ళి ఇదే ఆ దేవుని లీల ఇదే (పిచ్చోడి పెళ్ళి)...
దోరవయసు చిన్నది లా లా ల ల లా భలే జోరుగున్నది (దేవుడు చేసిన మనుషులు)...
నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకూ ఇవ్వమ్మ (గాజుల కిష్టయ్య)...
నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడూ నవ్వుతూ చావాలి రా (మాయదారి మల్లిగాడు)...
నయనాలు కలిసె తొలిసారీ హృదయాలు కరిగె మలిసారీ (ఛైర్మన్ చలమయ్య)...
నాకోసమే నీవున్నది ఆకాశమే అవునన్నది (అన్నదమ్ముల సవాల్)...
నిన్ను మరచి పోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలని (మంచి మనుషులు)...
నీలాలా నింగిలొ మేఘాలా తేరులొ ఆపాలా పుంతలో నీ కౌగిలింతలో (జేబుదొంగ)...
నీ పాపం పండెను నేడూ నీ భరతం పడతా చూడు (బుల్లెమ్మ బుల్లోడు)...
నీలీ మేఘమా జాలీ చూపుమా ఒక్క నిముషమాగుమా (అమ్మాయిల శపథం)...
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి (ఇంద్ర ధనుస్సు)...
ప్రణయరాగ వాహినీ చెలీ వసంత మోహినీ (మాయా మశ్చింద్ర)...
పాల రాతి మందిరానా పడతి బొమ్మ అందం (నేనూ మనిషినే)...
పూలు గుస గుస లాడేననీ సైగ చేసేననీ (శ్రీవారు మావారు)...
మన జన్మభూమీ బంగారు భూమీ పాడిపంటలతొ పసిడిరాశులతొ (పాడిపంటలు)...
మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే (నోము)...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామాయణం)...
మేడంటే మేడా కాదూ గూడంటే గూడూ కాదు (సుఖదుఃఖాలు)...
మేఘాల మీద సాగాలీ అనురాగాల రాశిని చూడాలి (దేవదాసు - కృష్ణ)...
రాధా అందించు నీ లేత పెదవి (జేబుదొంగ)...
రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలొ (శ్రీదేవి)...
సిరిమల్లె నీవె విరిజల్లు కావె (పంతులమ్మ)...
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ (జ్యోతి)...
సిన్ని ఓ సిన్నీ ఓ సన్న జాజుల సిన్నీ (జీవన జ్యోతి)...
సెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా (తులసి)...

"బాలు" గారి పాటలతో నాకే కాదు, నా బొమ్మలకీ విడదీయరాని "అనుబంధం". ఎప్పటికీ "బాలు" గారిపై నా అభిమానాన్ని ఆయన పాటలతో నా బొమ్మల్లో, నా బొమ్మలతో ఆయన పాటల్లో నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను...
🙏😢

4 comments:

  1. మీ కలెక్షన్ బాగుందండి 👌.
    బాలు గారి పాటల్లో నుండి సెలెక్ట్ చెయ్యడమంటే చాలా చాలా కష్టతరమైన పనే. దేన్ని సెలెక్ట్ చేస్తాం, దేన్ని వదిలేస్తాం? అయినా మరో రెండు పాటలు కూడా నాకు బాగా ఇష్టమైనవి ఇవి (మీ 1996 కు ముందువి 🙂)👇.

    * “ఆదిభిక్షువు వాడి నేది కోరేది” (1986)
    * “వీణ వేణువైన సరిగమ విన్నావా” (1979)

    ReplyDelete
    Replies
    1. అవునండీ...సెలెక్ట్ చెయ్యటం చాలా కష్టం, నేనప్పుడు ఏరికోరి చాలావరకూ 1970 లో పాటలే చేయించుకున్నాను.

      Delete
  2. నవీన్ కుమార్September 27, 2020 at 11:23 PM

    బాలు గారి గురించి మీరు రాసిన ఈ వ్యాసం చాలా అధ్భూతం సర్...నాది కూడా బుచ్చిరెడ్డిపాలెం ఏ సర్

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ...ఓ అవునా? మా నాన్న "పొట్టేపాళెం రామచంద్రయ్య" 1973-78 బుచ్చి హైస్కూల్ లో ఇంగ్లీష్, సోష్ల్ స్టడీస్ సబ్జెక్ట్స్ టీచర్ గ చేశారు. తర్వాత కావలి ట్రాన్స్ఫర్ అయ్యి కావలికి వెళ్ళిపోయాము.

      Delete