చూశమా..టైమ్ పాస్ అయిందా..అప్పుడే మర్చిపోయామా..అన్నట్టుండే సినిమాలే ఇప్పుడన్నీ, రోజుకో పదో పరకో విరివిగా వదుల్తున్నారీరోజుల్లో. ప్రేక్షకుల జేబుల్ని ఒక్కరోజైనా ఎలాగోలా కొల్లగొడితే హిట్ అయిందని సంబరాలు చేసేసుకోవచ్చు అన్న ధ్యాసతో వచ్చేవే ఇలాంటివన్నీ. కథతో పని లేదు, కథనంలో పస అసలే లేదు, శృతి తప్పిన సంగీతం, అర్ధం పర్ధం లేని పాటలు, మితం తప్పిన మాటలు, మితి మీరిన సన్నివేశాలు...ఈ సినిమాలకివే నిరర్ధకాధారాలు.
చూశామా..అనుభూతిని పొందామా..ఎప్పటికీ గుర్తుండిపోతుందా..అనిపించే సినిమాలు కొన్ని, దశాబ్ధానికి ఓకటో అరో అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులకి కొద్దికాలంపాటు గుర్తుండేలా వాళ్ళ మనసుల్ని గెలిస్తే మనం పడ్డ శ్రమ గెలిచినట్టే అన్న ధ్యేయంతో, కసితో వచ్చేవే ఇవి. కథపై దృష్టి, కథనంపైన కృషి, తెరకెక్కించే విధానంలో శ్రద్ధ, సన్నివేశంతో మమేకమైన సంగీత శ్రమ, భావోద్వేగ నటనపై పట్టు...ఇవే వీటికి ఆధారాలు.
మరాఠీ ప్రజలకి సుపరిచయమైన చరిత్రకారుడు "ఛావా" అని పిలవబడే (మరాఠీ లో ఛావా అంటే సింహం బిడ్డ) "ఛత్రపతి శంభాజి" ("ఛత్రపతి శివాజి" తనయుడు) కథని చరిత్రపుటల్లోంచి వెలికి తీసి తెరపై ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆవిష్కరించి ఈ సినిమాకై కృషి చేసిన దర్శకనిర్మాతలు, పనిచేసిన అందరూ సమర్ధులే, అభినందనీయులే.

ఇందులో ప్రధాన పాత్ర లో అత్యున్నత నటనతో ఒదిగి పోయి జీవించి ఆ పాత్రకి ప్రాణం పోసిన "వికీ కౌశల్" నటననా "కౌశలం" కి ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోతారు.
ఈ హిందీ సినిమా చూశాక...
మనసు ఉంటే చలించటం ఖాయం!
హృదయం ఉంటే ద్రవించటం ఖాయం!!
గుండె ఉంటే తరుక్కుపోవటం ఖాయం!!!
----
ఇది కేవలం నా అనుభూతి మాత్రమే, రివ్యూ ఎంత మాత్రం కాదు.

No comments:
Post a Comment