Saturday, February 10, 2024

భగవంతుడు . . .

 
భగవంతుడు
Ink & Watercolors on Paper

ఎవరే రూపంలో కొలిచినా
ఏ పేరు పెట్టి పిలిచినా
భగవంతుడు ఒక్కడే
కొలువైనది నీ మదిలోనే

నీలోనో ఇంకొకరిలోనో
ఏదో ఒకరూపంలో
ఎప్పుడో ఒకప్పుడు
కనిపించక పోడు

6 comments:

  1. వినాయకుడి చిత్రం సింపుల్గా చూడ చక్కగా గీశారు కదా 👏.

    వినాయక చవితి వస్తోందంటే చాలు రకరకాల చిత్రవిచిత్ర వేషాల్లో తయారు చేసి / చేయించి మండపాల్లో పెడుతుంటారు. ఖర్మ అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ!
      అవును, ఒద్దిగ్గా కూర్చున్న వినాయకుడిని వెయ్యాలనిపించింది.
      నిజానికిది స్కెచ్ మాత్రమే, ఆయిల్ పెయింటింగ్ కోసం ముందుగా పేపర్ మీద ఇంక్ అండ్ వాటర్ కలర్స్ తో వేసుకున్నాను.

      Delete
  2. వినాయకుడి బొమ్మ అద్భుతంగా వచ్చిందండీ.
    వినాయకుడి బొమ్మ అంటే నాకు తప్పకుండా ఒక తమాషా సంఘటన గుర్తుకు వస్తుంది. మావదిన గారు ఒకవిడ మనవడు జన్మతః మంచి చిత్రకళతో పుట్టాడు. ఒకసారి అతను వేస్తున్న బొమ్మలున్న పుస్తకం చూపించాడు, అందులో వినాయకుడి బొమ్మ ఉంది. ఐతే ఆబొమ్మలో వినాయకుడు మనం నిత్యం చూసేలా బాగా బొద్దుగా కాకుండా సన్నగ ఉన్నడు. "ఇదేమిటయ్యా వినాయకుడు ఇలా సన్నగా ఉన్నాడూ" అని అడిగితే, "వినాయకుడు డైటింగ్ చేస్తున్నాడు" అని చెప్పాడు తక్షణమే తడుముకోకుండా! ఆమాటను మేమంతా భలే ఎంజాయ్ చేసాం. ఆ పిల్లవాడు ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు పెద్దై.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ!
      మీరి పంచుకున్న సంఘటన తమాషాగా అనిపించింది. పిల్లలు వేసే బొమ్మల్ని చూసి పెద్దలు అడిగే ప్రశ్నలకన్నిటికీ వాళ్ళ దగ్గర సమాధానాలుంటాయి.
      నేను కూడా నిజానికి కొంచెం బొద్దు తగ్గించాను, డైట్ కాన్షియస్ అయిన ఈ తరం కి మరీ బొద్దు గా చూపొద్దులే అని... ;)

      Delete
  3. -
    ఒద్దిక గా కూర్చొని వర
    సిద్ధి వినాయకుని నొప్పు చిత్రము వేయన్
    బుద్ధికలిగె నా మదిలో
    నద్దాని ఫలితమరుదు గణాధిపతి యిగో!



    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ!
      మంచి ఛందస్సుతో ఆసుపద్యం చెప్పేశారు. ఇది ఏ కోవకు చెందిన పద్యమో గుర్తించలేనిప్పుడు.

      Delete