Saturday, January 27, 2024

ఇంకా ఇచ్చిన మాటలెన్నో . . .

"ఝాన్సి లక్ష్మి భాయి" గా మా "శ్రావణి" పాప - "లక్ష్మి హృదయ" 
Pen and watercolors on Paper (8.5" x 11")

దాదాపు రెండేళ్ళ తర్వాత ఈరోజు ఉదయం, "గిరీ, ఒక చిన్న బొమ్మ వెయ్యవా" అని నా మనసు నన్నడిగింది. ఈమధ్యనే చూసిన ఫొటో - కత్తి డాలు పట్టుకుని కదనరంగానికి సిద్ధం అయిన ఝాన్సి లక్ష్మి భాయి గా "మా శ్రావణి" కూతురు "లక్ష్మి హృదయ" రూపంలో నా మనసు మాట మన్నించా.

దాదాపు పదేళ్ళ క్రితం వాళ్ళబ్బాయి బొమ్మ వేసివ్వమని శ్రావణి అడిగితే అలానే అని మాటిచ్చా, ఆ మాట ఇన్నాళ్ళకిలా తీర్చా. "శ్రావణి" - మా చిన్నమామయ్య కూతురు, చిన్నపుడు హైదరాబాద్, విద్యానగర్ లో "గిరిమావయ్యా" అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ నా దగ్గరికి రోజూ వస్తూ ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో దేనికైనా ఏడుస్తుంటే ఎత్తుకుని వెళ్ళి శంకర్ మఠ్ దగ్గర బజార్ లో చాక్లెట్లు కొనిస్తే బుగ్గలపై కారుతున్న ఆ కన్నీళ్ళు ఒక్కసారి ఆనంద తాండవం చేసేవి. పసి పిల్లల దుఃఖాన్ని మరిపించి, మనసుల్ని మురిపించటం ఇంత సులభమా అనిపిస్తుంటుంది గుర్తుకొచ్చినపుడల్లా...

ఇంకా ఇచ్చిన మాటలెన్నో...
ఆ బాకీలన్నీ తీరేదెప్పటికో...
 

2 comments:

  1. నిజం ఝాన్సీ లక్ష్మీ బాయి సాహసవంతురాలే కాక చాలా అందగత్తె కూడా అని అంటారు. మీరు గీసిన చిత్రం కూడా అంత అందంగానూ ఉంది 👌.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ, చాలారోజులకి మీ నుంచి మళ్ళీ వ్యాఖ్య, సంతోషం!

      Delete