Wednesday, October 9, 2024

వికసించిన బ్రహ్మ కమలం . . .

"బ్రహ్మ కమలం" గురించి విన్నా కానీ ఎప్పుడూ చూడ్లేదు. ఇదే మొదటి సారి, అదీ మా ఇంట్లోనే. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇంట్లోనే పెరిగిన ఈ మొక్కకు ఈరోజు విరబూసిన కమలం. సూర్యాస్తమయం తర్వాత మెల్లిగా విరబూయటం మొదలు పెట్టి చీకటి పడ్డాక 7 నుంచి 9 గంటల  మధ్య దాదాపు రెండు గంటల పాటు కొంచెం కొంచెంగా వికసిస్తూ పూర్తిగా వికసించి పరిమళించిన తీరుని గమనించే అనుభవమే ఒక ఆశ్చర్యం.

ఈ అరుదైన కమలం హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందనీ, దీనిని ఎంతో పవిత్రమైనదిగా శుభసూచకంగా భావిస్తారనీ తెలిసి మనసులో ఒకింత సంతోషం. "ఏమో... ఏదో మంచి జరగబోతోందా" అన్న ఆలోచనే ఒక అద్భుతంగా అనిపించింది.

పక్కనే ఇంకొక మొగ్గ మరో ఒకటీ రెండు రోజుల్లో విరబూయటానికి సన్నద్ధం అవుతూ ఉంది.

"శుభం భూయాత్"
Pictures taken on Oct 8, 2024 7:00 - 9:00 PM EST



 

 



  

 


ఆ పక్కనే ఉన్న మొగ్గ మరుసటి రోజు విరబూసింది. ఆ మధుర మనోహర సుందర క్షణాల్ని బంధించిన వీడియోలు ఈ క్రిందివి:






No comments:

Post a Comment