Friday, April 17, 2020

అటు తిరిగిన అందమా...

"అటు తిరిగిన అందమా"    
Watercolors on Paper (11" x 14")

బొమ్మతో పెనవేసుకునే ఆలోచనలల్నీ, భావాల్నీ అక్షరాలుగ మార్చి జతచేసి తోడు చేయందే నా బొమ్మేదీ పూర్తి కాదు. ఈసారెందుకో తోడుగ వచ్చిన అక్షరాలన్నిటినీ పట్టి అందంగా పేర్చాలని ప్రయత్నించాను. భావాల్ని అక్షరాల్లో పొదగడమే "కవిత" అయితే, నా ఈ ప్రయత్నమూ కవితే. కుంచె అంచు చిలికిన రంగుల అందాలూ, కలం నుంచి ఒలికిన పదాల భావాలూ రెండూ నావే, నాలో స్ఫూర్తిని నింపుతూ నాకు తోడయ్యేవే...

~~~ ~~~~~~~ :: ~~~ ~~~~~ ~~~
రంగులొలికిన  హరివిల్లా
సొంపులొదిగిన విరిజల్లా

జాబిలి అద్దిన వెన్నెల వెలుగా
సొగసు దిద్దిన వన్నెల జిలుగా

మెరుపై విరిసిన మేఘమాలికా
చినుకై కురిసిన నాట్యకదలికా

వంపుల వయ్యారి వాలు కురులా
కులుకుల మయూరి అందెల సడులా

కిలకిల కోయిల చైత్రపు పాటలా
గలగల పరుగుల సెలయేరులా

విరబూసిన లేత గులాబి ఎరుపా
ముత్యమైన స్వాతి చినుకు మెరుపా

చుట్టిన ఎర్రటి అంచున పచ్చని చిలుకా
దట్టని తెల్లటి మంచున వెచ్చని పలుకా

చిత్రమై అటు తిరిగి నిలిచిన అందమా
నిజమై ఇటు పిలుపుని విని కనుమా...

~~~ ~~~~~~~ :: ~~~ ~~~~~ ~~~

Happy Painting! Happy Writing!!

"I have never started a poem yet whose end I knew. Writing a poem is discovering."

Details 
Title: అటు తిరిగిన అందమా...
Inspiration: A random picture I came across
Mediums: Watercolors
Size: 11" x 14" (21.5 cm x 27.9 cm)
Surface: Fabriano Watercolor Paper, Cold Press, 140 LB

No comments:

Post a Comment