Pages

Sunday, June 17, 2018

My Dad my first Guru...



My Dad was my first Guru

నాన్నా,

ఊహొచ్చాక నీతో కలిసెళ్ళిన పార్క్ ఏ
ఇప్పటికీ నాకందమైన ఉద్యాన వనం

నీ చేత్తో కాగితంపై నువు చెక్కిన నా పేరే
ఈనాటికీ నాకిష్టమైన అక్షరాల అపురూపం

తొమ్మిదేళ్ళకే నేనందుకున్న నీ ఉత్తరాలే
ఈనాటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలు

నువ్వు చూసిన నువు తిరిగిన ఆ చోట్లే
ఇప్పటికీ నేను నిన్నెతుక్కునే ప్రదేశాలు

ఆ దేవుడెదురైతే నేనడిగే మొదటి ప్రశ్న
నాన్న ప్రేమని లాక్కెళ్ళే హక్కు నీకెక్కడిదనే!
. . .
Happy Father's Day!


No comments:

Post a Comment