Pages

Saturday, April 18, 2020

ఆ నటరాజు నర్తించనీ...

"ఆ నటరాజు నర్తించనీ"
Multi-talented Dancer and Telugu Actress Karronya Katrynn 
Watercolors on Paper (9.5" x 12")

Give your best efforts when you want to see the best result.
లీనమై సాధన చేస్తే ఏ కళ అయినా ఖచ్చితంగా పరిణతితో రాణిస్తుంది.

Happy Painting!

Details 
Title: ఆ నటరాజు నర్తించనీ...
Inspiration: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 9.5" x 12" (24 cm x 30.5 cm)
Surface: Arches Watercolor Paper, Cold Press, 140 LB

Friday, April 17, 2020

అటు తిరిగిన అందమా...

"అటు తిరిగిన అందమా"    
Watercolors on Paper (11" x 14")

బొమ్మతో పెనవేసుకునే ఆలోచనలల్నీ, భావాల్నీ అక్షరాలుగ మార్చి జతచేసి తోడు చేయందే నా బొమ్మేదీ పూర్తి కాదు. ఈసారెందుకో తోడుగ వచ్చిన అక్షరాలన్నిటినీ పట్టి అందంగా పేర్చాలని ప్రయత్నించాను. భావాల్ని అక్షరాల్లో పొదగడమే "కవిత" అయితే, నా ఈ ప్రయత్నమూ కవితే. కుంచె అంచు చిలికిన రంగుల అందాలూ, కలం నుంచి ఒలికిన పదాల భావాలూ రెండూ నావే, నాలో స్ఫూర్తిని నింపుతూ నాకు తోడయ్యేవే...

~~~ ~~~~~~~ :: ~~~ ~~~~~ ~~~
రంగులొలికిన  హరివిల్లా
సొంపులొదిగిన విరిజల్లా

జాబిలి అద్దిన వెన్నెల వెలుగా
సొగసు దిద్దిన వన్నెల జిలుగా

మెరుపై విరిసిన మేఘమాలికా
చినుకై కురిసిన నాట్యకదలికా

వంపుల వయ్యారి వాలు కురులా
కులుకుల మయూరి అందెల సడులా

కిలకిల కోయిల చైత్రపు పాటలా
గలగల పరుగుల సెలయేరులా

విరబూసిన లేత గులాబి ఎరుపా
ముత్యమైన స్వాతి చినుకు మెరుపా

చుట్టిన ఎర్రటి అంచున పచ్చని చిలుకా
దట్టని తెల్లటి మంచున వెచ్చని పలుకా

చిత్రమై అటు తిరిగి నిలిచిన అందమా
నిజమై ఇటు పిలుపుని విని కనుమా...

~~~ ~~~~~~~ :: ~~~ ~~~~~ ~~~

Happy Painting! Happy Writing!!

"I have never started a poem yet whose end I knew. Writing a poem is discovering."

Details 
Title: అటు తిరిగిన అందమా...
Inspiration: A random picture I came across
Mediums: Watercolors
Size: 11" x 14" (21.5 cm x 27.9 cm)
Surface: Fabriano Watercolor Paper, Cold Press, 140 LB

Saturday, April 11, 2020

Make your own time...

Natyanjali - my tribute to Indian Classical Dance
Ballpoint Pen on Paper 8.5" x 11"  

Don't let your time go blank without collecting some memories. Time becomes memory when you travel into it carrying your passion with it. Make your own time, turn it into your own memories!

"I don't care how busy I am - I will always make time for what's most important to me."
- Kevin Hart

Details
Mediums: Ballpoint pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper

Saturday, April 4, 2020

"దీపం - చైతన్యం"...

"దీపం - చైతన్యం"
Oil Painting on Canvas 

A repost to support India's PM call to India to "light up a candle"
as a symbol of "unity" at 9PM for 9 minutes on Apr 5, 2020.

"దీపం - చైతన్యం"

As the entire world of people are facing the toughest time in their life-time for their own survival and existence, the call that our PM Mr. Narendra Modi gave to all Indians to "light up a candle" this Sunday at 9PM for 9 minutes, makes me think. Hope my thoughts in words make others also think.

As long as an act of doing something united with good intentions doesn't harm and hurt anyone in anyway, there is ABSOLUTELY NO REASON to think in a different direction or make fun of it. The direction here for this kind of call, the second time from our PM is very clear and the direction is "FORWARD". So, let's think forward without forgetting backward...

Facebook, WhatsApp ల్లో ఈ పిలుపు మీద వచ్చిన, వస్తున్న జోకులూ, వెటకారాలు చూస్తే మనం ఎటువైపెళ్తున్నామో అర్ధం కాని పరిస్థితి. కొంత మంది రాశులూ, తిథులూ, నక్షత్రాలకూ ఈ పిలుపుని లెఖ్ఖలు కట్టి మరీ చెప్తుంటే, మరికొందరు సైన్సూ, టెక్నాలజీ, దుమారం అంటూ కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ పక్కన బెట్టి ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి దేశం అంతా పాటిస్తే వచ్చే లాభం అంతా ఇంతా కాదు. కరెంట్ తోబాటు మరెన్నో కొరతల్నీ అధిగమించవచ్చు. మామూలు రోజుల్లో ఇలాంటి పిలుపుని అమలు చెయటం కష్టతరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సులభం, చాలా ఆరోగ్యకరం. అన్నిటికి మించి ప్రజల్లో చాలా చైతన్యం తెస్తుంది, ఇస్తుంది, వస్తుంది, నింపుతుంది. ఆలోచనా పెరుగుతుంది. క్లిష్ట సమయాల్లో అందర్నీ UNITE చేసి చైతన్యపరిచేవాడే నిజమైన "లీడర్".

గాంధి ఉప్పుసత్యాగ్రహాన్ని అప్పుడెందరు పరిహాసం చేశారో తెలీదు గానీ ఇప్పటి తరం తప్పకుండా  పరిహాసం పాలు చేసి నీరుకార్చొచ్చు. ఉప్పుమీద ఆగ్రహం ఏంటి అంటూ జోకులూ వెయ్యొచ్చు, డిబేట్లూ పెట్టొచ్చు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం, మనమెంతో ముందుకెళ్తున్నాం, పురోగతి సాధించామని మనందరి అపోహ. సాధించాం...సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా. కానీ జీవనపరంగా మాత్రం కానే కాదు. అప్పుడూ సోషల్ మీడియాలోనే అంతా జీవించారు. ప్రకృతితో సోషల్ అయ్యారు. మనిషీ మనిషీ కలిసి పలకరించుకుని మాట్లాడుకునే మీడియా లో బ్రతికారు. ఇప్పుడీ విపత్తు మనిషిని మళ్ళీ నిజమైన ఆనాటి సోషల్ మీడియా వైపు చూసేలా చేస్తుంది. ఇప్పుడు మనిషి జీవనం లో మార్పుకి "ఆలోచన" అనే విత్తనం వేస్తుంది. అది ఏదో ఒకరోజు మొలకెత్తక పోదు, మనషి మారకపోడు.

Olympics medals పట్టికలో ఎప్పుడూ వెనకే ఉంటాం అని మనల్ని మనమే అపహాస్యం చేసుకుంటాం, ఇప్పుడూ "కరోనా కేసుల రేసు" పట్టికలోనూ మనము వెనకే ఉన్నాం. ఉంటాం కూడ, మనల్నెవరూ కుట్రపన్ని బలవతంగా ముందుకి లాక్కెళ్లకుంటే. ఇందులో ఇంకా ఇంకా వెనకపడాలనే అందరం కోరుకుందాం. ఈ రేసులో ఎంత వెనకపడితే ఈ ప్రపంచంలో అంత ముందుకొస్తాం, అంత పైకొస్తాం. ఇంట్లో అమ్మచేతి వంట మన చేత్తో తినటం మానేసి, ఎవరో వండింది, ఎలా వండారో, ఎప్పుడు వండారో కూడా తెలీకుండా, ఎందరో ఎన్నిసార్లో వాడి సరిగా కడిగారో కూడా తెలీక, ఇదే చాలా ఫ్యాషన్, చాలా బెటర్ అని రెస్టారెంట్ లో కూర్చుని స్పూన్లు, ఫోర్కులతో  తినే (అ)నాగరికత కి అలవాటు పడిపోయాం. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు సడన్ గా లైట్లు ఆపి 9 నిమిషాలు దీపం వెలిగించండి అంటే కష్టమే. ఒకప్పుడు రోజూ ఇది పద్ధతే, ఈ పద్ధతి ఇప్పటికీ, ఎప్పటికీ మంచిదే. పాటిస్తే తప్పు లేదు, జరిగేది మంచే, మనలో నిండేది వెలుగే, వెలుగుతో వచ్చేది మార్పే, ఆ మార్పుతో వచ్చేది ముమ్మాటికీ చైతన్యమే.

ఈ పిలుపు వెనక అర్ధం సైన్సూ కాదు, మతం అంతకన్నా కాదు. దీని ముఖ్య ఉద్దేశ్యం "UNITY".

The world has united at last fighting for the same cause, but the human is still divided. The most advanced nations are all struggling to unite people on this. Previous generations of Indians had proven to the world in the past what "UNITY" means. The time has come again for this generation to teach the world how to live, and how to "truly live". There is no country on the earth better than INIDA to teach the world on "how to live".

I appreciate all who support this call understanding the cause behind, and follow it on this Sunday at 9 PM for 9 minutes. This is the respect we give to our Leader and to our Nation.

"వెలుగిచ్చే దీపం చైతన్యానికి రూపం
చీకట్లు చీలుస్తూ మార్గం చూపే దైవం"

(*This is not a post on my Art, this is a post on my thought.)